హైదరాబాద్ లో నిజాం ప్యాలెస్ ల ఒక్కరోజు పర్యటన !
భారతదేశంలో చరిత్రను గుర్తుకు తెచ్చే స్మారక కట్టడాలతో ప్యాలెస్ లు ఒకటి. వీటినే రాజభవనాలు అంటారు. మన దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్యాలెస్ లు ఉన్నాయి. అందునా తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో గల ప్యాలెస్ లు ప్రత్యేకమైనవి. ఎందుకంటే, అప్పట్లో హైదరాబాద్ నిజాం నవాబు ప్రపంచములోనే ధనిక రాజులలో ఒకడిగా ఉండేవాడు. ప్రపంచ దేశాల పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఇంటీరియల్ సామాగ్రి, లోహ వస్తువులను, పింగాణీ వస్తువులను మరియు ఇతర ఖరీదైన వస్తువులను చూసి వాటిని తన ప్యాలెస్ లో ఉండేటట్లు చూసేవాడు. ప్రస్తుతం ఇక్కడ చెప్పబోయే వ్యాసం హైదరాబాద్ లో ప్రఖ్యాతిగాంచిన విలాసవంతమైన మరియు అందమైన రాజభవంతుల గురించి. ఈ రాజభవనాలు హైదరాబాద్ లోనేకాదు యావత్ దేశంలోనూ ప్రసిద్ధి గాంచినవిగా ఉన్నాయి. హైదరాబాద్ లోని ప్యాలెస్ ల విషయానికి వస్తే, ...
ఫలక్ నూమా ప్యాలెస్ ఫలక్ నూమా అంటే ఆకాశ దర్పణం అని అర్థం. ఈ ప్యాలెస్ చార్మినార్ నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో కలదు. దీనిని ఆరవ నిజాం మామ వికారుల్ ఉమ్రా అప్పట్లో 60 లక్షలు వెచ్చించి, 32 ఎకరాల్లో నిర్మించాడు. ఇందులో 60 గదులు, 22 విశాల హాళ్లు, బంగారం మరియు క్రిస్టల్ తో తయారుచేసిన డైనింగ్ టేబుల్ (100 మంది కూర్చొని తినవచ్చు), లైబ్రరీ, బ్రిలియర్డ్స్ టేబుల్ లు ఉన్నాయి.
పురాని హవేలీ పురాని హవేలీ నిజాం నవాబుల అధికార నివాసం. దీనినే హవేలీ ఖాదీమ్ అని కూడా పిలుస్తారు. ఈ హవేలీ 'U' ఆకారంలో ఉంటుంది. 18 వ శతాబ్దం నాటి యూరోపియన్ భవనాలను గుర్తుకు తెస్తుంది.
హిల్ ఫోర్ట్ ప్యాలెస్ హిల్ ఫోర్ట్ ప్యాలెస్ ను 1915 వ సంవత్సరంలో అప్పటి నిజాం ప్రభుత్వంలో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన సర్ నిజమత్ జంగ్ కట్టించాడు. ఇతను ఇందులో 15ఏళ్ళు నివాసం ఉన్నాడు. ఆతరువాత దీనిని ప్రభుత్వ పరం చేసాడు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతప్రభుత్వం దీనిని రిట్జ్ కంపెనీ కి లీజుకిచ్చింది. ప్రస్తుతం ఇది తెలంగాణ టూరిజం ఆధీనంలో ఉన్నది.
చౌమహల్లా ప్యాలెస్ చౌమహల్లా ప్యాలెస్ ను 18 వ శతాబ్దం లో నిర్మించారు. దేని నిర్మాణం పూర్తవటానికి 10 సంవత్సరాలు పట్టింది. ప్యాలెస్ లో ఖరీదైన వస్తువులు, ఆయిల్ పెయింటింగ్ లు, దర్బార్ హాళ్లు ఉన్నాయి. నిజాం రాజుల పట్టాభిషేక కార్యక్రమాలు, ఉత్సవాలు, విందులు, వినోదాలు, గవర్నర్ జనరల్స్ ను ఆహ్వానించడం వంటివి ఇక్కడ నిర్వహిస్తారు.
జూబ్లీ హాల్ జూబ్లీ హాల్ ను ఉస్మాన్ అలీ ఖాన్ క్రీ.శ. 1913 వ సంవత్సరంలో నిర్మించాడు. ఇందులో ఆయిన సభలు, సమావేశాలు నిర్వహించేవాడు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా హాల్ లో కాన్ఫరెన్స్ లు, సమావేశాలు నిర్వహిస్తున్నది.
కింగ్ కోఠి ప్యాలెస్ కింగ్ కోఠి ప్యాలెస్ ను కమల్ ఖాన్ అనే అతను తన సొంత అవసరాల కోసం నిర్మించాడు. హైదరాబాద్ నవాబు కు ప్యాలెస్ మీద మనసు పడటంతో కమల్ ఖాన్ అతనికి ఇచ్చేసాడు. రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత కూడా నవాబు చౌమహల్లా ప్యాలెస్ కు వెళ్లకుండా దీనినే అధికారానివాసంగా మార్చుకున్నాడు.
ఆస్మాన్ గర్హ్ ప్యాలెస్ ఆస్మాన్ అంటే ఆకాశం మరియు గర్హ్ అంటే ఇల్లు అని అర్థం. పేరుకు తగ్గట్టే ఇది కొండ పైన ఉంటుంది. 1885 లో నోబుల్ సర్ ఆస్మాన్ జహ్ దీనిని నిర్మించాడు. మలక్ పేట లోని టీవీ టవర్ సమీపాన ఉన్న ఈ భవనంలో ప్రస్తుతం స్కూల్ నడుపబడుతున్నది.
రాష్ట్రపతి నిలయం సికింద్రాబాద్ లో గల రాష్ట్రపతి నిలయం అప్పట్లో బ్రిటీష్ వైశ్రాయి నివాసంగా ఉండేది. సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో, పురాతన చెట్ల నీడలో ఉన్న రాష్రపతి నిలయం ఆనాటి రాచరికపు తీపి గుర్తుగా నిలుస్తుంది. ప్రతి సంవత్సరం శీతాకాలంలో రాష్ట్రపతి తరచూ ఇక్కడికి రావటం ఆనవాయితీ.
ఆప్షన్ 1 :
పెద్దలకు : రూ. 3100/- పిల్లలకు : రూ. 2480/- వసతులు : ఎయిర్ కండీషన్ బస్సు, టీ, స్నాక్స్, ఎంట్రీ టికెట్లు
టూరిజం ప్లాజా, బేగం పేట వద్ద : మధ్యాహ్నం 1: 00 గంటలకు బస్సు బయలుదేరుతుంది. చౌమహల్లా ప్యాలెస్ కు మధ్యాహ్నం 2: 30 కు (ఇక్కడ గంట సేపు ఉండాలి), ఆతర్వాత ఫలక్ నుమా ప్యాలెస్ కు 4 - 5:30 గంటలకు బస్సు చేరుకుంటుంది. ఇక్కడ టీ, స్నాక్స్ వంటివి టూర్ లో భాగంగా ఇస్తారు. అజెండా లోని తర్వాతి లొకేషన్ గోల్కొండ సౌండ్ మరియు లైట్ షో (సాయంత్రం 6:45 నుండి రాత్రి 8:00 గంటల వరకు) వద్దకు తీసుకెళ్తారు