X Close
X
+91-9846067672

శిల్పారామం : కళలకు నిలయం !


శిల్పారామం : కళలకు నిలయం !


హైదరాబాద్ లోని శిల్పారామం శిల్పకళలకు నిలయం. భారతదేశంలో ఉన్న అన్ని రకాల సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకోవాలంటే శిల్పారామాన్ని తప్పక సందర్శించాలి. ఇక్కడ హస్తకళలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించబడతాయి. హైదరాబాద్ నుండి 14 కిలోమీటర్ల దూరంలో, మాదాపూర్ - హైటెక్ సిటీ కి దగ్గరలో ప్రఖ్యాతి గాంచిన కళలు, హస్తకళా వస్తువుల గ్రామం శిల్పారామం ఉన్నది. దేశంలో పురాతన కళలు, సంప్రదాయాలు మరిచిపోకుండా, వాటిని రక్షించే క్రమంలో ఈ గ్రామాన్ని స్థాపించారు. హైదరాబాద్ లో శిల్పారామం ఒక ప్రధాన పర్యాటక కేంద్రం.

ఏమేమి ఉన్నాయి ? శిల్పారామం సుమారు 50 ఎకరాలలో విస్తరించి ఉంది. క్రాఫ్ట్స్ మ్యూజియం, కల్చరల్ మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ మరియు లైబ్రరీ, ఆడిటోరియం, వర్క్ షాప్స్, రీసర్చ్ మరియు డిజైన్ సెంటర్ లు ఉన్నాయి. ఇవేకాక ఆర్టిస్టులకు మరియు విజిటర్స్ కు వసతి సదుపాయాలు కలవు. శిల్పారామం మొత్తం ఒక గ్రామీణ వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఈ గ్రామం మొత్తం తిరిగి చూపించటానికి బ్యాటరీ కారులు అద్దెకు దొరుకుతాయి. కానీ ఒక్కొక్కరు 15 రూపాయలు చెల్లించాలి.

శిల్పారామం షాపింగ్ లకు అనుకూలంగా ఉంటుంది. కేవలం స్థానిక హైదరాబాద్ ప్రజలకే కాక, ఇక్కడికి వచ్చే పర్యాటకులకు వీటిని కొనుగోలు చేస్తుంటారు. దేశం నలుమూలల నుండి వచ్చే హస్తకళా ప్రావీణ్యులు, తమ చేతి పనితనాన్ని ఇక్కడ ప్రదర్శిస్తారు. సంప్రదాయ ఆభరణాలు, చేతితో తయారుచేసిన చీరలు, డ్రస్సులు, బెడ్ షీట్ లు మొదలుగునవి వాటిలో కొన్ని. మెటల్ తో మరియు వుడ్ తో తయారుచేసిన వస్తువులను కూడా ప్రదర్శిస్తుంటారు. వీధి షాపింగ్ చూడాలనుకొనేవారికి కూడా ఆ ఫెసిలిటీ ఇక్కడ ఉంది. తక్కువ రేట్ లో దుస్తులు, వస్తువులు కొనుగోలు చేయవచ్చు. వీలైతే బేరాలు కూడా సాగించవచ్చు. 

షాపింగ్ అయిపోయిందిగా .. ఇక తినే వంతు. ఇక్కడి ఆహార రుచులు నోరూరిస్తాయి.సాంప్రదాయ వంటలు, చాట్స్ నేటివిటీకి దగ్గరగా ఉంటాయి. డాన్స్ ప్రదర్శనతో పాటు ఇతర కార్యక్రమాలు సాయంత్రంవేళ నిర్వహిస్తారు. దీనికి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. శిల్పారామంలో ఎడ్యుకేషనల్ సెంటర్ పిల్లలకు వర్క్ షాప్ లు, ట్రైనింగ్ క్యాంపు లు మరియు షార్ట్ టర్మ్ ట్రైనింగ్ తరగతులను నిర్వహిస్తూ ఉంటుంది. ఏటా మర్చి మొదటి రెండు వారాలలో ఆర్ట్ మరియు క్రాఫ్ట్స్ ఏడాది ఉత్సవాలు జరుగుతాయి. 

పండుగల సమయాలలో జనవరిలో వచ్చే సంక్రాంతి, ఉగాది, అక్టోబర్ లో వచ్చే దసరా, దీపావళి పండుగల నాడు సాంస్కృతిక కార్యక్రమాలను జరుపుతారు. గాలిపటాల పండగ, నవరాత్రి, సౌత్ ఇండియా ఫెస్టివల్ మొదలైనవి కూడా సంప్రదాయంగా నిర్వహిస్తారు. శిల్పారామం ను సంవత్సరంలో ఎప్పుడైనా సందర్శించవచ్చు కానీ పండుగలు, ఉత్సవాల నాడు సందర్శిస్తే కలర్ ఫుల్ గా ఉంటుంది.

వారంలో అన్ని రోజులలో ఆదివారం నుండి శనివారం వరకు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు శిల్పారామం తెరిచే ఉంటుంది. కనుక మీకు ఏ సమయం వీలైతే ఆ సమయంలో వెళ్ళండి. శిల్పారామం ఎంట్రీ ఫి కూడా చాలా తక్కువగానే ఉంటుంది. పెద్దవారికి 40 రూపాయలు, పిల్లలకు 20 రూపాయలు. శిల్పారామం ప్రవేశ రుసుము రూ. 40 /- పెద్దలకు, రూ. 20/- పిల్లలకు, రూ. 30 బోటింగ్ చార్జీ ఫోన్ : 040- 64518164
ఎప్పుడు సందర్శించాలి ? సంవత్సరంలో అన్నిరోజులూ సందర్శన సమయం : ఉదయం 10 : 30 నుండి రాత్రి 8: 30 వరకు తెరుస్తారు.