X Close
X
+91-9846067672

భారతదేశంలో మహిళలు కట్టించిన అద్భుత కట్టడాలు !


భారతదేశంలో మహిళలు కట్టించిన అద్భుత కట్టడాలు !

కళాకారుడు కళను సాధన ద్వారా సృష్టించి ప్రదర్శించే ఒక కళా నైపుణ్యం కలవాడు. భారతదేశంలో కళాకారులకు కొదువలేదు. కళను సాధన పట్టి నిర్మించిన అద్భుత కట్టడాలు భారతదేశంలో అనేకం. ఈ కట్టడాలన్నీ అప్పటి భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు, వైభవాలకు మరియు చారిత్రక నేపధ్యానికి ఆనవాళ్లు.

మీకో విషయం తెలుసా ? భారతదేశంలో ఆడవాళ్ళు కొన్ని అద్భుత కట్టడాలను నిర్మించారు. అడ, మగ అనే తేడా ఉన్న ఆ రోజుల్లోనే అటువంటి అద్భుత కట్టడాలు నిర్మించారంటే అతిశయోక్తికాదు. వీటిని కనక ఒకసారి చూస్తే, వారిని మెచ్చుకోకతప్పదు.

హుమాయూన్ సమాధి హుమాయూన్ సమాధి ఢిల్లీ లోని ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ. ఈ నిర్మాణం మిరక్ మీర్జా ఘియాత్ అనే పర్షియన్ వాస్తు శిల్పిచే నిర్మించబడింది. క్రీ.శ.1562 లో హుమాయూన్ జ్ఞాపకార్థం అతని భార్య హమీదా బాను బేగం సమాధిని నిర్మించారు. ఈ టూంబ్ ను హుమాయూన్ మరణించిన తొమ్మిది ఏళ్లకు నిర్మించారు. సమాధి చుట్టూ అందమైన తోటలు, ఫౌంటైన్ లు, నీటి కాలువలు, పాదాచారులు మార్గాలు ఉన్నాయి.

విరూపాక్ష ఆలయం పట్టడక్కాల్ ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలో కలదు. ఇక్కడ ఒక్కసారి ప్రయాణిస్తే చాలు, సౌత్ ఇండియాలో చాళుక్యుల కాలం నాటి వైభవం గుర్తుకు వస్తుంది. పట్టడక్కాల్ అనేక దేవాలయాల సమూహం. అందులో విరూపాక్ష దేవాలయాన్ని క్రీ.శ. 740 లో రాణి లోకమహాదేవి తన భర్త విక్రమాదిత్య II పల్లవులను ఓడించినందుకు గుర్తుగా నిర్మించింది.

రాణి కి వావ్ రాణి కి వావ్ అనే మెట్ల బావి సాంకేతిక పరిజ్ఞానానికి, శిల్పాశైలికి ప్రతీక. ఈ మెట్ల బావిని గుజరాత్ ను పాలించిన సోలంకి వంశీయుల రాణి ఉదయమతి సరస్వతి నది ఒడ్డున పటాన్ లో నిర్మించింది. దీనిని ఆమె భర్త రాజు భీమ్ దేవ్ జ్ఞాపకార్థం నిర్మించింది. నేడు ఇది ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో చేత గుర్తించబడి పర్యాటకులను ఆకర్షిస్తున్నది.

లాల్ దర్వాజా మసీద్ లాల్ దర్వాజా మసీద్ ను క్రీ.శ. 1447 లో జౌంపూర్ నగర శివార్లలో సుల్తాన్ మహమ్మద్ షార్కీ రాణి అయిన బిబి రజ్వీ నిర్మించెను. మసీదును ఆమె వ్యక్తిగత ప్రార్థనల నిమిత్తం ప్రత్యేకంగా నిర్మించారు. మసీదు నిర్మాణం చిన్నదే అయినా డిజైన్ మరియు నిర్మాణ శైలి ఆకట్టుకుంటుంది.

ఇత్మద్ - ఉద్ - దౌలాహ్ సమాధి నూర్జహాన్, తన భర్త అయిన మొఘల్ చక్రవర్తి జహంగీర్ కు, తండ్రి మీర్జా ఘియాస్ బేగ్ క్రీ.శ.1622 - క్రీ.శ. 1628 మధ్యలో నిర్మించిన కట్టడమే ఇత్మద్ - ఉద్ - దౌలాహ్. ఈ సమాధి 23 చ.మీ. విస్తీర్ణంలో విస్తరించి ఉంది. చుట్టూ పర్షియన్ గార్డెన్స్, తోటలు, కాలి మార్గాలు, ట్యాంకులు, సెలయేర్లు ఉన్నాయి.

మిర్జన్ ఫోర్ట్ మిర్జన్ ఫోర్ట్, కర్ణాటకలోని కుంటా పట్టణంలో అగ్నా శని నది ఒడ్డున కలదు. ఈ కోట ఒకప్పుడు అనేక యుధాలను చూసిందని చెబుతారు. క్రీ.శ. 16 వ శతాబ్దంలో గెర్ సొప్ప కు చెందిన రామి భైరవదేవి కోట ను నిర్మించిందని స్థానిక కధనం. ప్రవేశ ద్వారా, దర్బారు హాలు, రహస్య మార్గాలు, ఎత్తైన బురుజులు, బావులు కోట ఆకర్షణలుగా నిలిచాయి.

ఖైరుల్ మనజిల్ ఢిల్లీ లోని 'ఖైరుల్ మనజిల్' అనే మసీదును క్రీ.శ. 1561 లో మొఘల్ నిర్మాణ శైలిలో మహం అంగ అనే మహిళ నిర్మించింది. ఈమె మొఘల్ చక్రవర్తి అక్బర్ కు ఆయా గా సేవలందించింది.