X Close
X
+91-9846067672

పర్యాటక ఊరు పాలేరు..


ఖమ్మం : పచ్చని పార్కు.. అందమైన పూలవనం.. జలాశయంలో చక్కర్లు కొట్టేందుకు బోటింగ్.. ఒక్కటేమిటీ పర్యాటకులను ఆకట్టుకునే ప్రకృతి సోయగాలన్ని ఇప్పుడు పాలేరు సొంతం. గత ఆరేళ్ల నుంచి ఆదరణ లేక, అభివృద్ధి చేసే వారు లేక, పట్టించుకునే వారు కరువయ్యారు. ప్రభుత్వం చొరవతో ఇప్పుడు కూసుమంచి మండలం పాలేరు పార్కు ఆలనాపాలనను గ్రామపంచాయతీ చేపట్టింది. పాలేరు పార్కు అభివృద్ధి కోసం రూ.5లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. నిధుల విడుదలతో పార్కు సుందరీకరణ పనులను వేగవంతం చేశారు.

దీంతో ఇప్పుడు పార్కు రూపురేఖలే మారిపోయింది. పచ్చని చెట్ల మధ్య, అందమైన పూలవనాలతో పార్కు పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. పిల్లలు ఆడుకునేందుకు ఆటవస్తువులు కూడా ఉన్నాయి. ఎంతో మంది చిన్నారులు దూర ప్రాంతాల నుంచి వచ్చి సందడి చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే పాలేరుకు ప్రత్యేకర్షణగా బోటింగ్ ఏర్పాటు నిలుస్తుంది. పర్యాటశాఖ ఆధ్వర్యంలో రూ.2.80 లక్షలతో స్పీడ్ బోటింగ్ సౌకర్యాన్ని ఏర్పరిచారు. పర్యాటకుల సందడితో బోటింగ్‌కు యమక్రేజ్ లభిస్తుంది. మొత్తానికి పాలేరు జలాశయం పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఉల్లాసం ఉత్సాహానిస్తుంది.