X Close
X
+91-9846067672

మౌంట్‌ మెరపి అగ్నిపర్వతం నుండి బూడిద


volcano

  జకార్తా : ఇండోనేషియాలోని మౌంట్‌ మెరపి అగ్నిపర్వతం శుక్రవారం ఉదయం ప్రాంతంలో 6 కిలోమీటర్ల ఎత్తులో బూడిదను వెదజల్లుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ పర్వతం చుట్టుపక్కల పదికిలోమీటర్ల వ్యాసార్థంలో సుమారు 2.50 లక్షల మంది ప్రజలు నివసిస్తుండటంతో జాతీయ విపత్తు నిర్వహణ సంఘం హెచ్చరికల స్థాయిని పెంచింది. సాధారణంగా అగ్నిపర్వతం చుట్టూ మూడు కిలోమీటర్ల మేర హెచ్చరిక బోర్డులు ఉంటాయని, కిందటి నెల ఈ హెచ్చరికల స్థాయిని కొంతమేర తగ్గించినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం బూడిదను వెదజల్లడంతో తిరిగి శుక్రవారం నుండి హెచ్చరిక స్థాయిలను పెంచినట్లు తెలిపారు. 

అయితే విస్ఫోటనం సంభవించలేదని, సుసిపో యోగ్యకార్తా అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలు కూడా రాకపోకలు సాగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మెరాపి అగ్ని పర్వతం 2010లో భారీ విస్ఫోటనం చెందడంతో సుమారు 347 మంది మ అతి చెందారని అధికారులు పేర్కొన్నారు. ఇండోనేషియా ద్వీప సమూహంలో 25 కోట్ల జనాబా నివసిస్తున్నారని, పసిఫిక్‌ ''రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌'' లో ఉండటంతో తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనాలు సంభవిస్తాయని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయని అధికారులు తెలిపారు. ఇండోనేషియా ప్రభుత్వ భూకంప శాస్త్రవేత్తలు నిరంతరం 120 అగ్నిపర్వతాలను పర్యవేక్షిస్తుంటారని అధికారులు పేర్కొన్నారు. 

(ANN NEWS TELUGU)