X Close
X
+91-9846067672

భారత హాకీ కెప్టెన్‌గా శ్రీజేష్‌


sreejesh

 న్యూఢిల్లీ : ఈ నెలలో జరిగే చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొనే భారత హాకీ జట్టు కెప్టెన్‌గా పిఆర్‌ శ్రీజేష్‌ను ఎంపిక చేశారు. 18 మంది సభ్యులతో ఉన్న భారత జట్టులో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, వరుణ్‌కుమార్‌, అమిత్‌ రోహిదాస్‌.. తదితర ఆటగాళ్లు స్థానం దక్కించుకున్నారు. 'యువకులు, అనుభవజ్ఞలైన ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేశామని, ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించడానికి చాంపియన్స్‌ ట్రోఫీ సరైన వేదిక' అని భారత జట్టు ప్రధాన కోచ్‌ హరేంద్ర సింగ్‌ తెలిపారు. 

ఈ ఏడాదిలో ముందు ముందు ఆసియా గేమ్స్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌ జరగనున్న నేపథ్యంలో చాంపియన్స్‌ట్రోఫీలో రాణించడం భారత బృందానికి చాలా అవసరమని సింగ్‌ తెలిపారు. నెదర్లాండ్స్‌లోని బ్రెడాలో ఈ నెల 23 నుంచి చాంపియన్స్‌ ట్రోఫీ ప్రారంభం కానుంది. భారత్‌ తన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ జట్టుతో తలపడుతుంది. గత చాంపియన్స్‌ట్రోఫీలో భారత్‌ రజత పతకం గెలుచుకుని సంచలనం సృష్టించింది. 34 సంవత్సరాల తరువాత ఈ టోర్నిలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఉత్కంఠగా జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్‌ పరాభవం చెందింది.

(ANN NEWS TELUGU)